తూర్పు గోదావరి జిల్లా టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు జగన్ బంపర్ ఆఫర్

తూర్పు గోదావరి జిల్లా టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు జగన్ బంపర్ ఆఫర్

0
83

2019 ఎన్నికల తర్వాత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.. ఈ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో ఆపార్టీలో పరిణామాలు తీవ్ర చోటుచేసుకుంటున్నాయి…

ఇప్పటికే ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు టీడీపీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపీకి రాజీనామా చేశారు…. తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయాకి పంపారు. ఆతర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ… గతంలో తన నియోజకవర్గ ప్రజలు చూపించిన ప్రేమను తాను ఎప్పుడు మరిచిపోలేనని పార్టీతో సంబంధం లేకుండా తనకు మద్దతు ఇచ్చారని అన్నారు.

పార్టీ మారారనేది ముఖ్యం కాదని నియోజకవర్గాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేశారనేది ముఖ్యం అని అన్నారు.. అందుకే తాను తన ప్రాంత అభివ్రుద్దికోసం ఈనెల 18న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలోకి చేరుతున్నాని ప్రకటించారు. కాగా ఆయనకు జగన్ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్ష పదవిని ఇచ్చేఅవకాశం ఉంది.