బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..అక్టోబర్ 1 నుంచి మరో కొత్త పథకం అమలు

0
98

ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు ఏపీ సీఎం జగన్. ఇక తాజాగా మరో సంచలన పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా ఎస్సి , ఎస్టీ, బీసీ, మైనార్టీలకు లబ్ది చేకూరనుంది. రాష్ట్రంలో అక్టోబరు 1 నుంచి వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకం అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఈ పథకం ద్వారా ఎస్సీలకు లక్ష రూపాయలు అందజేయనుంది. ఎస్సీల కులాంత వివాహాలకు రూ. 1.2 లక్షలు ఇవ్వనుంది.

ఎస్టీలకు రూ. 1 లక్ష సాయం చేయనుంది.
ఎస్టీల కులాంతర వివాహాలకు రూ.1.2 లక్షలు ఇవ్వనుంది.

బీసీలకు రూ. 50వేలు.. వారు కులాంతర వివాహాలు చేసుకుంటే రూ.75వేలు సాయం చేయనుంది.

మైనార్టీలకు రూ. 1 లక్ష సాయం అందించనుంది.

వికలాంగుల వివాహాలకు రూ. 1.5 లక్షలు సాయం చేయబోతున్నట్లు తెలిపింది. భవన నిర్మాణ కార్మికులకు రూ.40వేలు ఇవ్వనన్నట్లు తెలిపింది.