జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు….

జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు....

0
85

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. తాజాగా కర్నూల్ జిల్లాలో పర్యటించిన జగన్ అక్కడ వైఎస్సార్ కంటి వెలుగు మూడో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు…

ఆ తర్వాత ఆయన సభలో మాట్లాడుతూ… మంచిపనులు చూసి చంద్రబాబు నాయుడు పాటు విపక్షాలు కడుపు మంటతో ఉన్నారని ఆరోపించారు… అయితే ఈ కడుపు మంటకు ఆరోగ్య శ్రీలో చికిత్స లేదని అన్నారు… అలాగే కంటి వెలుగులోచెడు చూపుకు కుళ్లిన మెదడుకు చికిత్సలు మందులు లేవని అన్నారు….

మంచి పనులు చేస్తుంటే విపక్షాలు వాటిని తప్పుబడుతున్నాయని పలు ఛానల్లు అపద్దపు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు జగన్… వాటికి తాను ఎప్పుడు భయపడనని అన్నారు… ప్రజలను ఆరోగ్యంగా చూడటమే తమ లక్ష్యం అని అన్నారు…