ఏపీలో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కాపులకు మరింత దగ్గర అవుతున్నారు అనే చెప్పాలి.. ఈ ఎన్నికల్లో తన వెంట ఉన్న కాపునేతలకు వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద పీట వేస్తున్నారు. మంత్రి పదవులు కూడా ఇచ్చారు, ఇక కాపులకు తాను చేస్తాను అన్న ప్రతీ హమీ నెరవేరుస్తున్నారు.
కాపులని బీసీల్లో చేరుస్తాం అనే దానిపై జగన్ హామీ ఇవ్వలేకపోయారు, ఇది కేంద్రం చేతిలో ఉన్న వ్యవహరం అని తెలియచేశారు. తాజాగా జగన్ కాపు కార్పొరేషన్ ను పునరుద్ధరించి, ఏడాదికి రూ.2 వేల కోట్లు కేటాయిస్తామన్నారు.. అలాగే చేశారు . ఈ ఏడాది బడ్జెట్ లో కేటాయింపులు చేశారు.
తాజాగా ఏపీలో బలిజ ఒంటరి కాపులను ఆదుకునేందుకు వైఎస్ఆర్ కాపునేస్తం పేరుతో కొత్త పథకానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు.. .45 ఏళ్లు దాటిన మహిళలకు ఏడాదికి 15 వేల రూపాయలు అందిస్తాము అన్నారు. అయితే దీనిపై కాపులు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.. జగన్ చేసిన ప్రకటనతో ఆయన బ్యానర్లకు పాలాభిషేకం చేస్తున్నారు.