జగన్ షాక్ బీజేపీ కార్యాలయంలో దర్శనం ఇచ్చిన వైసీపీ ఎంపీ

జగన్ షాక్ బీజేపీ కార్యాలయంలో దర్శనం ఇచ్చిన వైసీపీ ఎంపీ

0
86

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణం రాజు మళ్లీ కాంట్రవర్సీగా మారారు.. దీంతో అయనపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి… ఇటీవలే సుజనా చౌదరి టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు బీజేపీకి టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు…

ఆయన చేసిన వ్యాఖ్యలు గంటలు గడవకముందే రఘురామ కృష్ణం రాజు ప్రధాని మోదీని కలిశారు… దీంతో ఆయనపై అనేక అనుమానాలు వచ్చాయి… దీనిపై ఇటీవలే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వివరణ కూడా ఇచ్చారు… దీంతో పరిస్థితి మొత్తం సర్దుమనిగిందని అనుకునే సమయంలోను ఆయన మరో షాక్ ఇచ్చారు…

రఘురామ కృష్ణం రాజు వైసీపీ అగ్రనేతలకు చెప్పకుండా మళ్లీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలోకి దర్శనం ఇచ్చారు… దీనిపై వైసీపీ మరోసారి గుర్రున ఉంది… అయితే తనకు ఢిల్లీలో ఇల్లు కేటాయించకపోవడంపై హౌస్ కమిటీ తో చర్చించడనాకే వెల్లానని చెబుతున్నారు…