నిజమే జగన్ కు గెలుస్తాం గెలుస్తాం అని నూరిపోసే నేతలు పక్కన ఉన్నందున తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా తీసుకోవడంలేదట ..ఇక ఉత్తరాధి వ్యక్తిని తీసుకువచ్చి రాజకీయంగా ఎన్నికల వ్యూహకర్తగా పెట్టుకున్నారు.. ఇలాంటి సర్వేలు మనకు తెలియనివి కాదు, ఆయన ఇచ్చే సర్వేలు ఉత్తరాధివారిపై ప్రభావం చూపిస్తాయోమో కాని, ఏపీలో మాత్రం కష్టం అని చెప్పాలి .అక్కడ రాజకీయాలు వేరు అక్కడ అవసరాలు వేరు, సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ వేరు , అలాగే ఇక్కడ పథకాలు వేరు… మరి జగన్ వారితో ఎలా ఏకీభవించి నిర్ణయాలు తీసుకుని ఎన్నికల్లో వారి సలహాలు తీసుకుని ముందుకు కదిలారు అనేది తెలియడం లేదు.
ఇక తెలుగుదేశం పార్టీకి ఎక్కడ చూసినా మెజార్టీ సర్వేలు వస్తున్నాయి… విజయం తథ్యం అని చెబుతున్నారు.. దీంతో పార్టీ తరపున నేతలు కూడా చాలా హుషారుగా ఉన్నారు… సీనియర్లు సైతం విజయం మనదే అని చెబుతున్నారు… ముందు జగన్ ఇలాంటి సరైన నిర్ణయాలు ఇవ్వని దరిద్రపు ఐడియాలు ఇచ్చేవారిని పక్కనపెట్టాలి అని చెబుతున్నారు తెలుగుదేశం నేతలు.. ఇలాంటి వారి వల్ల జగన్ సాధించేది ఏమీ లేదు అని చెబుతున్నారు. తాజాగా మంత్రి దేవినేని ఉమా ఇటు జగన్ పై విజయసాయిరెడ్డి పై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.
పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏం జరుగుతుందో ఏం తెలుసనీ విజయసాయిరెడ్డి ఇష్టమొచ్చినట్టు ట్వీట్లు పెట్టడం తప్ప అంటూ నిప్పులు చెరిగారు ఉమా .అలాగే ప్రశాంత్ కిషోర్ పై కూడా బీహార్ లో కేసులు ఉన్నాయని వీరిద్దరూ పక్కన ఉండడం వల్ల జగన్ కు పెద్ద నష్టమే తప్ప ఒరిగేది ఏమి లేదని దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు.వీరిద్దరినీ వదిలినట్టయితే జగన్ కు సగం దరిద్రం వదిలిపోతుంది అంటూ దేవినేని ఉమా సంచలన కామెంట్స్ చేసారు. మరి గెలిచేది ఎవరు ఓడేది ఎవరు అంటే కచ్చితంగా, 1000 కి1000 శాతం తెలుగుదేశం గెలుస్తుంది అని ధీమా ఆయన వ్యక్తం చేశారు.