వైసీపీలో మొదలైన పదవుల రేసు జగన్ మనసులో ఆ నలుగురు…

వైసీపీలో మొదలైన పదవుల రేసు జగన్ మనసులో ఆ నలుగురు...

0
80

వైసీపీలో అప్పుడే పదవులు రేసు మొదలైంది… గత ఎన్నికల్లో సమాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థులను ఎంపిక చేశారు… ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే స్ట్రాటజీని పాటించారు…. మహిళలకు అలాగే బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని తన కేబినెట్ లో తీసుకున్నారు… మంత్రిదవులను ఆశించిన వారు ఎమ్మెల్యే సీటు ను త్యాగం చేసిన వారికి జగన్ భరోసా ఇచ్చారు..

అయితే వచ్చే ఏడాది నాలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు… బలాబలగాల ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఈ నాలుగు సీట్లు వైసీపీకే దక్కుతాయి అందుకే చాలాంది రాస్యసభ సీటును దక్కించుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు..

కానీ జగన్ మనసులో నలుగురు ఉన్నారని వార్తలు వస్తున్నాయి… బీదమస్తాన్ రావు, గోకరాజురంగరాజు రాంకీ గ్రుప్ అధినేత అయోధ్య రామిరెడ్డి తో పాటు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతకు సీటు ఇవ్వాలని భావిస్తున్నారట…