జగన్ పై లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

జగన్ పై లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

0
70

అమరావతిని తరలించకూడదని శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న మహిళలపై ప్రతాపం చూపించడం దారుణం అని టీడీపీ మాజీ మంత్రి ఎమ్మెల్సీ నారాలోకేశ్ అన్నారు… ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట పై నిలబడండి, మడమ తిప్పకండి అని అక్కాచెల్లెళ్ళు అడగటం తప్పా అని లోకేశ్ ప్రశ్నించారు…

అంతేకాదు లాఠీలతో ఉద్యమాలను అణిచి వేయాలి అనుకున్న నియంతలు ఎక్కడ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని లోకేశ్ ఆరోపించారు…. అమరావతిలో పోలీసులు మహిళల గొంతు నొక్కి, ఈడ్చుకెళ్లే ఘటన జగన్ మోహన్ రెడ్డి నిరంకుశత్వ పాలనకు నిదర్శనం అని ఎద్దేవా చేశారు లోకేశ్….

కాగా కొద్ది కాలంగా అధికార వైసీపీ ప్రతిపక్షటీడీపీ నాయకుల మధ్య మాటల యుద్దం జరుతున్న సంగతి తెలిసిందే… అమరావతి పేరుతో టీడీపీ హయాంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డరాని వైసీపీ నాయకులు విమర్శిస్తుంటే… అమరావతిని మార్చేందుకు వైసీపీ నాయకులు కుట్రలు పడుతున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు… ఇలా ఒకరిపై ఒకరు మాటల యుద్దం కొద్ది కాలంగా చేసుకుంటున్నారు.