జగన్ ఉద్యోగులకు ఏం చేశారో తెలుసా ఈ లిస్ట్ చూడండి

జగన్ ఉద్యోగులకు ఏం చేశారో తెలుసా ఈ లిస్ట్ చూడండి

0
79

ఏపీలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.. అయితే ఏపీ ఆర్దిక పరిస్దితి బాగాలేకపోయినా ఆయన పలు కీలక పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఉద్యోగులకి వేతనాలు కూడా పెంచారు.

ఆశా వర్కర్లకు రూ. 3 వేల నుంచి రూ.10 వేలకు పెంపుచేశారు….బోధన ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లలో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బంది వేతనం రూ.16 వేలకు పెంచారు.

హోం గార్డులకు రూ.18వేల నుంచి రూ.21 వేలకు జీతాలు పెంచారు…వీవోఏ(వెలుగు యానిమేటర్లు) వేతనం రూ.3 వేల నుంచి 10 వేలకు పెంపుచేశారు.

108 పైలెట్(డ్రైవర్)కు ప్రస్తుతం రూ.13 వేల వేతనం ఉండగా.. దాన్ని రూ.28 వేలకు, ఈఎంటీ(ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్)కి ప్రస్తుతం రూ.15 వేలు వేతనం ఉండగా.. దాన్ని రూ.30 వేలకు పెంచారు.

104 వాహన ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్లకు రూ.17,500 చొప్పున వేతనం ఉండగా, దాన్ని రూ.28 వేలకు, డ్రైవర్ కి .15,000 వేతనం ఉండగా, దానిని రూ.26 వేలకు పెంచారు.

మధ్యాహ్నభోజన కార్మిలకు నెలకు రూ.3 వేలు జీతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.. వీటిపై పెద్దఎత్తున జగన్ కు పాజిటీవ్ ప్రశంసలు వస్తున్నాయి.