నిజమే వాహనదారులు సరిగ్గా రూల్స్ ఫాలో అవ్వడం లేదు.. దీని వల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి, అయితే ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నా కొందరిలో మార్పు మాత్రం రావడం లేదు. అందుకే ఏపీ సర్కారు భారీగా మార్పులు తీసుకువచ్చింది, ఇక ఫైన్ల వాత మాములుగా లేదు.
వాహన జరిమానాలు పెంచుతూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవో ప్రకారం.. బైక్ నుంచి 7 సీటర్ కార్ల వరకూ ఒకే విధమైన జరిమానా విధించనున్నట్లు జగన్ సర్కార్ స్పష్టం చేసింది. మరి ఇప్పుడు ఆ జీవోలో అంశాలు చూద్దాం.
సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే ముందు ఐదు వేలు తర్వాత 10 వేలు
రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా దొరికితే ముందు రెండు వేలు తర్వాత 5000
పర్మిట్ లేని వాహనాలు నడిపితే రూ.10 వేలు,
మీ వెహికల్ ఓవర్ లోడ్ తో ఉంటే 20 వేలు
వాహన బరువు చెకింగ్ కోసం ఆపకపోతే రూ.40 వేలు
మీరు ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే రూ.10 వేలు జరిమానా
అనవసరంగా హారన్ మోగిస్తే ముందు రూ. వెయ్యి, రెండోసారి రూ.2 వేలు
వేగంగా వాహనం నడిపితే రూ. వెయ్యి జరిమానా విధింపు
ఇలా కొత్త రూల్స్ కొత్త ఫైన్లు తీసుకువచ్చారు, సో వాహనదారులు ఇకపై జాగ్రత్తగా ట్రాఫిక్ రూల్స్ పాటించి వాహనాలు నడపాలి అని కోరుతున్నారు అధికారులు.