బొత్సకి జగన్ వార్నింగ్ నిజం ఏమిటి

బొత్సకి జగన్ వార్నింగ్ నిజం ఏమిటి

0
90

చిన్న అవకాశం దొరికతే దానిని భూతద్దంలో పెట్టి చూపిస్తాయి కొన్ని ఎల్లో మీడియాలు.. ముఖ్యంగా వైసీపీ ఎక్కడ ఏ పాయింట్ దగ్గర దొరుకుతుందా అని చూస్తూనే ఉన్నారు.. ఈ సమయంలో సీనియర్ నాయకుడు జగన్ కు సన్నిహితుడు అయిన మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్లు తెలుగుదేశం పార్టీ పట్టుకుంది.

ఇక రాజధానిని శ్మశానం అంటూ బొత్స చేసిన ప్రకటన మీద తెలుగుదేశం పార్టీ విపరీతమైన విమర్శలు ఆరోపణలు చేస్తోంది.. గతంలో రాజదాని మార్పు గురించి బొత్స చేసిన కామెంట్లు ఇప్పుడు తాజాగా చేసిన కామెంట్లతో బొత్సని తెలుగుదేశం టార్గెట్ చేస్తోంది.

దీంతో జగన్ మంత్రి బొత్సపై ఫైర్ అయ్యారని, ఆయనమంత్రి పదవికి ఎసరు పెట్టారు అనేలా ఎల్లో మీడియాలో వార్తలు వదులుతున్నారు… వాస్తవానికి జగన్ మంత్రి బొత్సకి ఎలాంటి వార్నింగ్ ఇవ్వలేదట. ఇదంతా పనిపాటా లేని ఎల్లో మీడియా వార్త అని సత్తిబాబు అభిమానులు కొట్టిపారేస్తున్నారు.