జగన్ కు లోకేశ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు

జగన్ కు లోకేశ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు

0
94

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 48వ పుట్టిన రోజులు వేడుకలు ఈరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే… ఆయన పుట్టిన రోజు వేడుకలను రాష్ట్ర మంతా ఒక పండుగలా చేసుకుంటోంది…

ప్రతీ ఒక్కరు జగన్ కు ఫోన్ చేసి విశేష్ చెబుతున్నారు… అలాగే మరికొందరు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు… అయితే ఇదే క్రమంలో టీడీపీ నేత ఎమ్మెల్సీ నారా లోకేశ్ కూడా జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు…

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలని లోకేశ్ తెలిపారు… ఆయన నిత్యం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నానని లోకేశ్ అన్నారు…