Breaking: గుడ్ న్యూస్..“జగనన్న చేదోడు” నిధులు విడుదల

"Jagannanna Chedodu" funds released.

0
129

ఏపీ సీఎం జగన్‌ ప్రజలకు తీపికబురు చెప్పారు. కాసేపటి క్రితమే… జగనన్న చేదోడు రెండో ఏడాది నగదు జమ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం. ఈ మేరకు మొత్తం రూ. 285.35 కోట్లు విడుదల చేశారు. ఇక ఈ పథకం ద్వారా.. 2.85 లక్షల మంది రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీ సోదరులకు లబ్ది చేకూరనుంది. ఇక జగనన్న చేదోడులో భాగంగా షాపులున్న 1,46,103 మంది టైలర్లకు రూ. 146.10 కోట్లు లబ్ది చేకూరనుంది.. షాపులున్న 98,439 మంది రజకులకు రూ. 98.44 కోట్లు, షాపులున్న 40,808 మంది నాయీ బ్రాహ్మణులకు రూ. 40.81 కోట్లు లబ్ది చేకూరనుంది.