ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్ లు మరోసారి భేటీ కానున్నారు… ఈ నెల 13వ తేదీన జగన్ భేటీ కానున్నారు… ఈ భేటీపై ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి జవహర్ పలు ఆరోపణలు చేశారు…
జగన్ సోదరుడు కేసీఆర్ సూచనల మేరకే మూడు రాజధానుల ప్రకటన చేశారని ఆయన ఆరోపించారు… తెలంగాణకు మేలు చేసేందుకే అమరావతిని తరలించాలని చూస్తున్నారని జవహర్ ఆరోపించారు… మూడు రాజధానులపై చర్చించేందుకు జగన్ భేటీ కానున్నారని విమర్శలు చేశారు…
కాగా ఈ భేటీలో పౌర సత్వ సవరణ చట్టం యన్ఆర్ సీ అమలుపై వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది…ఇప్పటికే యన్ఆర్ సీ నీ అమలు చేసేది లేదని జగన్ ప్రకటించారు…. ఇటు తెలంగణలోనూ యన్ఆర్ సీ పై చర్చ జరుగుతోంది..