జనసేన టార్గెట్ ఆ ఇద్దరు వైసీపీ మంత్రులే…

జనసేన టార్గెట్ ఆ ఇద్దరు వైసీపీ మంత్రులే...

0
92

పవన్ కళ్యాణ్ అలాగే నాగబాబులు జనసేన పార్టీ తరపున ఏపీ రాజకీయాలు చేస్తున్నారు… కరెంట్ ఇష్యూస్ పై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు… ఓటమి తర్వాత జనసేన పార్టీ బీజేపీతో చేతులు కలిపింది… దీంతో భవిష్యత్ బేఫికర్ అన్నట్లుగా కొంత ధైర్యం చూపిస్తున్నారు… అయితే మెగా బ్రదర్స్ ముఖ్యంగా అధికార వైసీపీ టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే అందులో కూడా ఇద్దరు మంత్రులను మరీ ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు…

దీని వెనుక కథ వేరేగా ఉందని అంటున్నారు… తాజాగా నాగబాబు విశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ని ఉద్దేశించి చేసిన ట్వీట్ గురించి చెప్పుకోవాలని అన్ని పశువులూ గడ్డి తినవు శ్రీనూ అంటూ నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు సెగలు పుట్టిస్తోంది… విశాఖకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ గతంలో ప్రజారాజ్యం ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు.. ఆ తర్వాత కాంగ్రెస్ టీడీపీ నుంచి వైసీపీ లో చేరారు…

జగన్ చేరదీసి టికెట్ ఇచ్చి మంత్రిని చేశారు… దీంతో తమ అన్న పార్టీ ద్వారా బయటకు వచ్చి ఎమ్మెల్యే అయి తమ కళ్ల ముందే ఎదిగి ఇలా మంత్రి అయిపోవడం మెగా బ్రదర్స్ కి మింగుడు పడినట్లు లేదని ప్రచారం ఉంది… గతంలో పవన్ కూడా అవంతి మీద వ్యక్తిగత మిమర్శలు చేయడం దానికి అవంతి తనదైన శైలిలో రియాక్ట్ కావడం జరిగాయి… ఇక మరో మంత్రి కన్నబాబు కూడా పవన్ అప్పట్లో గట్టిగానే టార్గెట్ చేశారు…