తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్లాన్

తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్లాన్

0
103

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి కోసం ఇప్పుడు తెలంగాణలో చాలా మంది సీనియర్ నేతలు ఎదురుచూస్తున్నారు.. ఈలైన్ చాలా పెద్దగా ఉంది. ఎమ్మెల్యేలు చాలా మంది ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు.

టీ-పీసీసీ రేసులో తానూ ఉన్నానని, నేను సీరియస్ గానే ప్రయత్నిస్తున్నానంటూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం పీసీసీ ఇంఛార్జీ కుంతియాను కలిశానని, తనకు ఈ పదవి ఇవ్వాలని కోరానని చెప్పారు. ఇలా తెలంగాణలో చాలా మంది కాంగ్రెస్ నేతలు ఈ పదవి కోసం క్యూ కట్టారు.

ఇక జగ్గారెడ్డి కూడా ప్రయత్నం చేస్తున్నారు అని వార్తలు వినిపించాయి.ఇప్పుడు ఆయన క్లారిటీ ఇచ్చారు.
ఈ నెలాఖరులోగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలను కలుస్తానని తెలిపారు.
డబ్బు రాజకీయాలు ఎక్కడా పనిచేయవు అన్నారు, జూనియర్లు సీనియర్లు కలిసి పని చేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని తెలిపారు.