Flash: కేసీఆర్ బర్త్ డే వేడుకలపై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్

0
95
ఎప్పుడు తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఇవాళ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్బంగా టిఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఈరోజు నిరసన కార్యక్రమాలకు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి కేసీఆర్ బర్త్ డే వేడుకలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు జరుపుకోవడంలో తప్పేం ఉందని… దానికి నిరుద్యోగానికి ఏం సంబంధం అని ప్రశ్నించారు.