జగ్గారెడ్డికి బుజ్జగింపులు..పార్టీ వీడొద్దని కాళ్లు పట్టుకున్న కాంగ్రెస్ నేత

0
69

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ వివాదాలు కొత్తేమీ కాదు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కాంగ్రెస్ లో మరిన్ని వివాదాలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బహిరంగంగానే వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దీనితో ఆయన అసంతృప్తికి లోనై జగ్గారెడ్డి పార్టీని వీడబోతున్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇవాళ తన అనుచరులతో భేటీ అనంతరం కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది.

అయితే జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడకుండా బుజ్జగింపు ప్రయత్నాలు మొదలయ్యాయి. తాజాగా విహెచ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కలిశారు. పార్టీని వీడొద్దని, అన్యాయాలపై పోరాటం చేద్దామని విహెచ్ సూచించారు. మరోవైపు పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లి కిషన్ ఏకంగా జగ్గారెడ్డి కాళ్లు పట్టుకుని పార్టీని వీడొద్దంటూ బ్రతిమిలాడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.