జైలు నుంచి విడుదల అయిన వెంటనే సీఎం జగన్ పై చింతమనేని హాట్ కామెంట్స్.

జైలు నుంచి విడుదల అయిన వెంటనే సీఎం జగన్ పై చింతమనేని హాట్ కామెంట్స్.

0
120

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ చింతమనేని ప్రభాకర్ కు తాజాగా కోర్టులో బెయిల్ మంజూరు కావడంతో ఆయన విడుదల అయ్యారు.. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ పై హాట్ కామెంట్స్ చేశారు… జగన్ కు మహాభారతంలోని ధృతరాష్టుడికి ఏ మాత్రం తేడా లేదని ఆరోపించారు..

కేవలం కక్ష సాధింపు చర్యల్లోనే తనను అరెస్ట్ చేశారాని చింతమనేని మండిపడ్డారు…తనపై అక్రమ కేసులు బనాయించారని దీనిపై హైకోర్టులో పోరాడుతానని తెలిపారు… అలాగే అచ్చెన్నాయుడుపై కూడా అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారని మండిపడ్డారు…

ఆయనకు ఆపరేషన్ జరిగిందని చెప్పినా కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్లారని ఆరోపించారు… తాను ఆందోళన చేయడానికి వెళ్తే పోలీసులు వద్దని చెప్పారని దీంతో తాను వెంటనే తిరిగి వచ్చేస్తుంటే పోలీసులు కావలనే అరెస్ట్ చేశారని మండిపడ్డారు…