పాలిట్‌బ్యూరో, పొలిటికల్ అఫైర్స్ కమిటీని ప్రకటించిన జనసేనాని

పాలిట్‌బ్యూరో, పొలిటికల్ అఫైర్స్ కమిటీని ప్రకటించిన జనసేనాని

0
85

జనసేన పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణతో ఆపార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అడుగులు వేస్తున్నారు. శుక్రవారం విజయవాడలో పార్టీ నేతలతో సమావేశమైన ఆయన పాలిట్ బ్యూరో, పొలిటికల్ అఫైర్స్ కమిటీని ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసిన యువ అభ్యర్ధులతో ప్రత్యేక కమిటీ, క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చేట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. జనసేన విధివిధానాలకు, సిద్దాంతాలకు బద్దులై క్షేత్రస్థాయిలో మమేకం కావాలని, భావి తరాల ప్రయోజనాలకి.. యువ రాజకీయ చైతన్యానికి ప్రాధాన్యమిచ్చారు.

క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌గా మాదాసు గంగాధరంను పవన్ నియమించారు. అలాగే జనసేన పాలిట్ బ్యూరో సభ్యులుగా.. నాదెండ్ల మనోహర్, పి.రామ్మోహన్, రాజు రవితేజ్, అర్హం ఖాన్ నియమితులయ్యారు. పొలిటికల్ అపైర్స్ కమిటీ.. కమిటీ ఛైర్మన్‌గా నాదెండ్ల మనోహర్‌ను నియమించారు. సభ్యులుగా.. తోట చంద్రశేఖర్, రాపాక వరప్రసాద్, కొణిదల నాగబాబు, కందుల దుర్గేష్, కోన తాతారావు, ముత్తా శశిధర్, పాలవలస యశస్విని, పసుపులేటి హరిప్రసాద్, మనుక్షాంత్ రెడ్డి, ఎ.భరత్ భూషణ్, బి.నాయకర్‌లు నియమితులయ్యారు.