Pawan Kalyan | ‘మీరు సిద్ధం అంటే.. మేము యుద్ధం అంటాం’

-

వచ్చే ఎన్నికలకు సీఎం జగన్ సిద్ధం అంటే.. తాము మాత్రం యుద్ధం అంటామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. భీమవరం నియోజకవర్గ నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ టీడీపీ-జనసేన కలిసి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. కుటుంబాలను విచ్ఛిన్నం చేసే వ్యక్తి జగన్‌ అని… మనుషులను విడగొట్టడం ఆయనలో ఉన్న విష సంస్కృతి అని విమర్శించారు. కులాలు కొట్టుకు చావాలనేదే జగన్‌ నైజం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

“జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి చాలా కష్టపడి రూ.వేల కోట్లు సంపాదించి పెడితే.. జగన్ తన చెల్లెలికి అన్యాయం చేశారు. ఇద్దరు బిడ్డలకు వైఎస్ సమానంగా పంచి ఇస్తే.. అందులో చెల్లికి వాటా ఇవ్వలేదు. అది చాలా బాధ కలిగించే అంశం. వైఎస్ షర్మిలకు సాక్షి పేపర్‌, భారతి సిమెంట్‌లో వాటాలు ఇవ్వలేదు. సొంత చెల్లెలికే అన్యాయం చేసిన వ్యక్తి.. మనకేం చేస్తారు. అప్పులు తెచ్చి బటన్లు నొక్కడం ఎందుకు.. అభివృద్ధి పనులు చేసేందుకు బటన్లు నొక్కాలి” అని చెప్పకొచ్చారు.

వచ్చే ఎన్నికల్లో నాయకులు డబ్బులు ఖర్చుపెట్టాల్సిందే అని పేర్కొన్నారు. కనీసం భోజన ఖర్చులైనా పెట్టుకోరా అని ప్రశ్నించారు. అయితే ఈ ఎన్నికలలో ఓట్లు కొంటారా? లేదా? అన్నది మీ ఇష్టం అని స్పష్టంచేశారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేవి ఈ రోజుల్లో కుదరవన్నారు. కనీసం 2029 తర్వాతైనా డబ్బులతో ఓట్లు కొనలేని రాజకీయం రావాలని.. అప్పుడే నిజమైన అభివృద్ధి జరుగుతుంది అని పవన్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...