జనసేనకు గుడుబై చెప్పడానికి మేయిన్ రీజన్ ఇదే… జేడీ లక్ష్మీ నారాయణ

జనసేనకు గుడుబై చెప్పడానికి మేయిన్ రీజన్ ఇదే... జేడీ లక్ష్మీ నారాయణ

0
89

జనసేన పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చారో క్లారిటీ ఇచ్చారు మాజీ జేడీ లక్ష్మీ నారాయణ… తాజాగా ఆయన ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ఫుల్ టైమ్ పాలిటిక్స్ చేద్దామని జనసేన పార్టీలో చేరానని తెలిపారు కానీ జనసేన పార్టీలో ఫుల్ టైమ్ రాజకీయలు లేదని స్పష్టం చేశారు..

అందుకే తాను జనసేన పార్టీనుంచి బయటకు వచ్చానని తెలిపారు… తాను రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశానని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నానని తాను ఎప్పుడు భావించలేదని అన్నారు… ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు…

తాను ఉద్యోగం మానేసిన తర్వాత వెంటనే రాజకీయాల్లోకి రాలేదని అన్నారు… ప్రజల సమస్యలు తెలుసుకున్న తర్వాత ప్రజా ప్రతినిధిగా అయితే వారి సమస్యల తీర్చవచ్చు అన్న భావంతో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు… అలాగే తాను బీజేపీలో చేరుతానంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయని అన్నారు జేడీ…. మనం ఎక్కడున్నా మార్పుకోసం ప్రయత్నించాలని అన్నారు…