పవన్ కు షాక్ మరో కీలక నేత జనసేనకు గుడ్ బై

పవన్ కు షాక్ మరో కీలక నేత జనసేనకు గుడ్ బై

0
84

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మరో బిగ్ షాక్ తగిలింది… ఆపార్టీకి చెందిన మరో కీలకనేత గుడ్ బై చెప్పనున్నారు… ఇప్పటికే మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, పార్థసారధి వంటి కీలక నేతలు జనసేనకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఈ షాక్ నుంచి పవన్ కోలుకోక ముందే మరో షాక్ తగిలింది… ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ జనసేనను వీడనున్నారు త్వరలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు… ఈమేరకు అందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా సిద్దం చేసుకున్నారు

మంచి ముహూర్తం చూసుకుని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకోనున్నారు… గత ఎన్నికల సమయంలో ఆకుల సత్యనారాయణ బీజేపీ నుంచి జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.. పార్టీ తరపున రాజమండ్రి ఎంపీ స్ధానానికి పోటీ చేసి ఓటమి చెందారు. కాగా 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా ఎమ్మెల్యేగా గెలిచారు…