జనసేన రైట్ హ్యాండ్ పార్టీకి గుడ్ బై

జనసేన రైట్ హ్యాండ్ పార్టీకి గుడ్ బై

0
118

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మరో బిగ్ షాక్ తగలనుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అలాగే సోషల్ మీడియాలో… అన్న మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు రాజకీయాల్లో యాక్టివ్ గా కనిపించారు పవన్… ఇక కొన్నాల్లకు అన్న రాజకీయాల్లో ఫేయిల్ అయ్యారు…

తర్వాత పవన్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు… 2014లో జనసేన పార్టీని స్థాపించారు…. ఆయన పార్టీ స్థాపించిన అదే సంవత్సరం ఎన్నికలు జరిగాయి కానీ పవన్ ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీకి అలాగే బీజేపీకి మద్దతు ఇచ్చారు… ఆ తర్వాత కొన్నాల్లకు టీడీపీతో విడాకులు తీసుకుని 2019 ఎన్నికల్లో పోటీ చేశారు… కానీ ప్రజలు మాత్రం పవన్ వెంటనడవలేదు…

ఆయన పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఓటమి చెందారు… దీంతో తమకు జనసేన పార్టీలో ఉంటే రాజకీయ మనుగడ ఉండదనే ఉద్దేశంతో చాలామంది వైసీపీ అలాగే బీజేపీలోకి చేరుతున్నారు… ఇక ఇదే క్రమంలో మరో కీలక నేత జనసేనకు గుడ్ బై చెప్పాలని చూస్తున్నారట.. జనసేనకు కు బ్యాక్ బోన్ గా ఉంటూ అన్నీ తానై వ్యవహరించారు గతంలో… అలాంటి ఆయన ఇప్పుడు పార్టీ మారితే రానున్న రోజుల్లో కష్టాలు వస్తాయని అంచనా వేస్తున్నారు…