జనసేనకు 10 వేల మంది గుడ్ బై

జనసేనకు 10 వేల మంది గుడ్ బై

0
72

పవన్ కల్యాణ్ పై వైసీపీ ముందు నుంచి ఒకే స్టాండ్ లో ఉంది, పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకి కీలు బొమ్మ అని విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతలు ..ఆయన బాబు చెప్పింది చేస్తాడు అని అంటారు వైసీపీ అభిమానులు .. గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉంటే జగన్ ని ఆయన విమర్శించేవారు, అధికారంలో ఉన్నవారిని ఏమీ అనేవారు కాదు, ఇప్పుడు జగన్ ని మళ్లీ విమర్శిస్తూ బాబుకి సపోర్ట్ చేస్తున్నారు.

అయితే పవన్ కల్యాణ్ ని రాజకీయంగా ఈ స్టేజ్ కు తీసుకువచ్చిన చంద్రబాబుతో, పవన్ జత కడుతున్నారు అని కొందరు జనసేన సైనికులు గుర్తించారట.. అయితే ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత జనసేనకు కొందరు దూరం అవుతున్నారు అని తెలుస్తోంది.

దాదాపు 10 వేల మంది వరకూ పార్టీకి దూరం అయ్యారట.. అసలు వైసీపీని నిత్యం టార్గెట్ చేయడం వల్ల టీడీపీ జనసేన రెండూ ఫ్రెండ్లీ పార్టీలు అని ప్రజలు భావిస్తున్నారని, అయినా పవన్ మారడం లేదు అని కొందరు బహిరంగంగా చెప్పుకుంటూ పార్టీకి దూరం అవుతున్నారని టాక్ నడుస్తోంది.