జనసేనలో నెక్ట్స్ వికెట్ ఆయనేనా

జనసేనలో నెక్ట్స్ వికెట్ ఆయనేనా

0
88

జనసేనలో నెలకో నాయకుడు పార్టీలో కీలకంగా మారిన నేతలు గుడ్ బై చెబుతున్నారు.. తాజాగా ఆపార్టీకి మాజీ జేడీ లక్ష్మీనారాయణ గుడ్ బై చెప్పారు.. పవన్ సినిమాలు చేయను అని సినిమాలు చేయడం ఏమిటి ? నిలకడ లేని ఆలోచనలతో తాను పార్టీకి గుడ్ బై చెబుతున్నాను అని తెలిపారు.

ల‌క్ష్మినారాయ‌ణ త‌ర్వాత ఆ స్థాయి నాయ‌కుడు తోట చంద్ర‌శేఖ‌ర్‌. ఈయ‌న కూడా ఐఏఎస్ అధికారి. అంతే కాకుండా ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త కూడా. జ‌న‌సేన‌కు ఆర్థికంగా తోడ్పాటునందిస్తూ వ‌చ్చారు. మరి ఆయన కూడా పార్టీలో కాస్త యాక్టీవ్ గా లేరు. ఆయన గతంలో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ఇటు వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన నేత… అయితే నాదెండ్ల మనోహర్ కు పార్టీలో ప్రాధాన్యత పెరగడంతో ఆయన కూడా పార్టీకి కాస్త దూరంగానే ఉంటున్నారు, ఆయనకి కనీస సమాచారం ఇవ్వకుండా జనసేన పార్టీ కార్యక్రమాలు కొన్ని జరుగుతున్నాయట అందుకే ఆయన కూడా తదుపరి పార్టీకి గుడ్ బై చెబుతారు అని వార్తలు వినిపిస్తున్నాయి.