సినిమాలను వదిలి రాజకీయల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గతంలో జనసేన పార్టీ స్థాపించారు. 2014 ఎన్నికల్లో పవన్ పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడుతో చెడి విడాకులు తీసుకుని 2019 ఎన్నికల్లో 66 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశారు. అధికారంలోకి రావాలంటే రౌండ్ ఫిగర్ 88 అసెంబ్లీ స్థానాలు కానీ పవన్ 66 స్థానాల్లో పార్టీ తరపున అభ్యర్థులను పోటీ చేయించి తానే సీఎం అవుతానని అంటున్నారు.
పోనీ ఈ నియోజకవర్గాల్లో అయినా ప్రచారం చేశారా అంటే అదీలేదు ఫట్ మని 30 నియోజకవర్గాల్లో కూడా పవన్ ప్రచారం చేయలేదు అలాంటిది ఆయన ఎలా సీఎం అవుతారని రాజకీయ మేధావులు అంటున్నారు. ఇక ఈయన సీఎం పదవి సంగతి పక్కన పెడితే ఈ ఎన్నికల్లో ఐదు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ గెలుస్తుందని అంచనా వేస్తున్నారు.
అందులో పవన్ పోటీ చేస్తున్న భీమవరం, గాజువాక, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, తెనాలి, యలమంచిలి, నియోకవర్గాల్లో పార్టీ గెలుస్తుందని అంటున్నారు. పవన్ భీమవరంలో గెలవకపోయినా గాజువాకలో గెలుస్తారని అంటున్నారు. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో జనసేన టీడీపీ వైసీపీలకు గట్టిపోటీ ఇచ్చిందని అంటున్నారు. అత్యధిక మెజార్టీతో కగెలవకపోయినప్పటికీ ఈ ఐదు నియోజకవర్గాల్లో స్వల్ప మెజార్టీతో గెలుస్తుందని అంచనా వేస్తున్నారు.