వైసీపీకి జనసేన సీరియస్ వార్నింగ్….

వైసీపీకి జనసేన సీరియస్ వార్నింగ్....

0
95

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ కు జనసేన పార్టీ నాయకులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు… ఆయన ఇస్టాను సారం మాట్లాడితే చుస్తూ ఊరుకోమని హెచ్చరించారు… తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జనసేన పార్టీ నాయకులు ఆందోళనకు సిద్దమయ్యారు..

దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు… దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది… నిరసనలు చేసే హక్కు తమకు ఉందని తెలిపారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి అజయ్ వర్మ…. వైసీపీ ఎమ్మెల్యే అవినీతి చరిత్ర ఏంటో అందరికి తెలుసని అన్నారు…

వైసీపీ నాయకుల మాదిరి తాము ఓట్లు కొనుక్కుని గెలవలేదని అన్నారు అజయ్… మీ నాయకుడులాగ అవినీతి చేసి జైలుకు వెళ్లలేదన్నారు… సస్కారం మరిచి మాట్లాడటం తమ నాయకుడు నేర్పలేదని అన్నారు… వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అన్నారు. తమనేతపై నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు…