జనసేన కు షాక్ ఆ ఏమ్మెల్యే రాజీనామా

జనసేన కు షాక్ ఆ ఏమ్మెల్యే రాజీనామా

0
86

ఏపీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన జనసేన పార్టీ ..మెల్ల మెల్ల గా ప్రజల్లో తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ లోపే జనసేనకు ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేసిన వారు పార్టీకి రాజీనామాలు చేయడం ఇబ్బంది మారింది.

తాజాగా తణుకు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పసుపులేటి వెంకట రామారావు పార్టీకి రాజీనామా చేశారు. తణుకు నియోజకవర్గ ఇంఛార్జ్‌గా తనను కాదని..ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో పార్టీ నియమావళికి వ్యతిరేకంగా రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ వేసి, ఇతర పార్టీలకు ఆర్థిక సాయం చేసి జనసేన ఓటమికి కారణమైన వ్యక్తిని నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఎలా నియమిస్తారని రామారావు ప్రశ్నించారు.

”నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ నియామక విషయం పార్టీ పెద్దలకు చెప్పాను. పవన్ కళ్యాణ్‌కి చెప్పడం కోసం ప్రయత్నించాను కానీ ఆయన అపాయింట్‌మెంట్ కూడా లభించలేదు” అని రామారావు ఆవేదన వ్యక్తం చేశారు.