కరోనా వైరస్ దెబ్బకి పూర్తిగా మూడు నెలలుగా లాక్ డౌన్ అమలులో ఉంది, ఏ పని లేక ఉపాధి కరువై చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యంగా అన్నీ రంగాలకు ఇది ఇబ్బందిగానే ఉంది, ఇక వలస కూలీలకు చాలా ఇబ్బందిగానే ఉంది, అయితే.
కేంద్రం తాజాగా పేదలకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.బ్యాంక్ ఖాతాలో డబ్బులు లేకపోయినా కూడా బ్యాంక్‌కు వెళ్లి రూ.5,000 విత్‌డ్రా చేసుకొని రావొచ్చు. జన్ ధన్ అకౌంట్ కలిగిన వారికి ఈ బెనిఫిట్ ఉంది.
ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన స్కీమ్ కింద బ్యాంక్ అకౌంట్ తీసుకున్న వారు ఇలా ఓడీ అంటే ఓవర్ డ్రాఫ్ట్ 5 వేలు పొందవచ్చు.
కచ్చితంగా మీ అకౌంట్ ఆధార్ కార్డ్ కి లింక్ అయి ఉండాలి, అలాగే మీరు ఆరు నెలలుగా ఆ అకౌంట్లో నగదు వేసి తీయడం ట్రాన్సెక్షన్ చేస్తూ ఉండాలి, ఇలా ఉన్న ఖాతాలకు ఐదువేల రూపాయలు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పిస్తున్నారు.