జనవరి 1 నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్ తప్పక తెలుసుకోండి

జనవరి 1 నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్ తప్పక తెలుసుకోండి

0
89

మన దేశంలో ముఖ్యంగా చాలా మందిలో ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లో మార్పు రావడం లేదు. నిత్యం హెల్మెట్ పెట్టుకోవాలి అని చెబుతున్నా కొందరు లెక్క చేయరు. వేగంగా వెళుతూ ట్రాఫిక్ లో సిగ్నల్ జంప్ వద్దు అన్నా జంప్ చేస్తారు. సరి అయిన వాహన పత్రాలు ఉంచుకోమని చెప్పినా ఇక్కడ ఏ డాక్యుమెంట్లు క్యారీ చేయరు. ముగ్గురు కాదు ఏకంగా నలుగురు ఐదుగురు కూడా బైక్ పై ప్రయాణాలు చేస్తారు. ఎన్ని సార్లు పోలీసులు హెచ్చరించినా పట్టించుకోరు.

చలాన్లు వేస్తే కట్టి మళ్లీ అవే తప్పులు చేస్తున్నారు కొందరు వాహనదారులు.. అంతేకాదు మితిమీరిన వేగంతో ర్యాష్ డ్రైవింగ్ తో పక్కవారి ప్రాణాలను వీరు హరిస్తున్నారు.. అయితే కేంద్రం మరింత కఠిన చట్టాలు తీసుకురావడంతో కొందరిలో మార్పు వచ్చింది. ఇంకొందరిలో ఇంకా మార్పు రావాల్సి ఉంది. ఇక ట్రాఫిక్ లో పోలీసులకు మీరు చిక్కితే మీ పని అంతే, ఇప్పటి వరకూ హెల్మెట్ లేకపోతే మీకు చలాన్లు వేసేవారు మీ దగ్గర ఫైన్ కట్టించుకునేవారు కాని ఇప్పుడు రూల్ మారింది.

జనవరి 1వ తేదీ నుంచి హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ పై తిరిగితే ఇక మీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు నెల రోజుల పాటు మీకు లైసెన్స్ ఉండదు ఈ సమయంలో మరో బైక్ నడుపుతూ కనిపిస్తే మీకు జైలు శిక్ష విధిస్తారు.. ఆ బైక్ పై కేసు కూడా నమోదు చేస్తారు. చాలా మంది ఇలా ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే వారికి కచ్చితంగా ఈ శిక్షలు వేస్తామంటున్నారు పోలీసులు, మరి ట్రాఫిక్ లో ఈ రూల్స్ పాటించకుండా పోలీసులకు చలాన్లు కట్టి వెళ్లిపోతున్న చాలా మందికి ఇక చుక్కలు చూపించనున్నారు పోలీసులు.