జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఏపీకి చెందిన వ్యక్తి. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిగా పని చేశారు జస్టిస్ జాస్తి చలమేశ్వర్. అయితే ఆయనకు తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక పదవి ఇవ్వనున్నారు అని వార్తలు వస్తున్నాయి.
అవును ఆయనను రాజ్యసభకు పంపాలి అని పార్టీ తరపున రాజ్యసభకు పంపితే న్యాయపరంగా పార్టీకి కావలసిన సలహాలు ఇస్తారు అని భావిస్తున్నారట, కృష్ణాజిల్లా యాదవ సామాజిక వర్గానికి చెందిన చలమేశ్వర్ సేవలను ఉపయోగించుకోవాలని చూస్తున్నారు, ఇప్పుడు వైసీపీలో కీలక పదవి ఇవ్వబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి.
ఇక అన్నీ పార్టీలు కూడా ఇలా న్యాయవాదులు న్యాయమూర్తులను ఇలా పదవులు ఇచ్చి పెద్దల సభలకు పంపుతున్నారు.. తాజాగా వైసీపీ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని అంటున్నారు, మరి చూడాలి ఈ నిర్ణయం వాస్తవమా కాదా అనేది.