జేసీ బ్రదర్స్ కు వైసీపీ ఆఫర్

జేసీ బ్రదర్స్ కు వైసీపీ ఆఫర్

0
88

తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు… రాష్ట్ర ప్రభుత్వం కొందరిని మాత్రమే టార్గెట్ చేసుకుని కేసులు పెడుతోందని ఆయన ఆరోపించారు… తాజాగా మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాలంలో ఇది మరింత ఎక్కువ అవుతుందని జేసీ అన్నారు…

ఇటీవలే జేసీ ట్రావెల్స్ ను అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే… ఈ బస్సులు నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్నాయని సీజ్ చేశారు అధికారులు… అయితే తాము 74 సంవత్సరాలుగా ట్రాన్స్ పోర్ట్ లో అనుభవం ఉందని అన్నారు…

ఒక్క దివాకర్ బస్సు మాత్రమే నిభందలకు విరుద్దంగా నడుస్తుందా అని ప్రశ్నించారు జేసీ… హద్దు మీరిన పరిపాలన రాష్ట్రంలో జరుగుతోందని అన్నారు… పార్టీలో చేరమని చెబుతున్నారని అలాగైతే కేసులు ఏమీ ఉండవని అంటున్నారని అన్నారు… జేసీ మరోవైపు అధికారులు ప్రభుత్వం చెప్పినట్లు వినాల్సివస్తోందని అంటున్నారటన లేదంటే బదిలీలు వేటు పడుతుందని అధికాలు అంటున్నారని జేసీ తెలిపారు…