జూనియర్ ఎన్టీఆర్ కాదు సీనియర్ ఎన్టీఆర్ వచ్చినా టీడీపీ రావడం కష్టం..!!

జూనియర్ ఎన్టీఆర్ కాదు సీనియర్ ఎన్టీఆర్ వచ్చినా టీడీపీ రావడం కష్టం..!!

0
93

విలక్షణ సినీ నటుడు, మాటల రచయిత పోసాని కృష్ణమురళి జగన్ పై ఉన్న తన అభిమానాన్ని ప్రకటించారు. జగన్ ఎప్పుడూ రాంగ్ రూట్ లో వెళ్ళరని, చాలా టఫ్ మనిషి అంటూ ఆయనపై ప్రసంశల జల్లు కురిపించారు. ఇక చంద్రబాబుపై విరుచుకు పడ్డారు. రాజకీయాల్లో ప్రస్తుతం చంద్రబాబు వంటి నాయకుడి అవసరం లేదన్నారు. ఇటీవలే చిన్నపాటి సర్జరీ చేయించుకున్న ఆయన, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మీడియా అడిగిన ప్రశ్నలకి ఆయన తనదైన శైలిలో సమాధానాలిచ్చారు.

జూనియర్ ఎన్టీఆర్ చేతిలోకి టీడీపీ పగ్గాలు వెళ్లే అవకాశం ఉందనే ప్రచారంపై ఆయన స్పందిస్తూ, ” జగన్మోహన్ రెడ్డిగారి పరిపాలన బాగోలేనప్పుడు .. అంతా అవినీతిమయమైపోయినప్పుడు మాత్రమే ఇక్కడ సీనియర్ ఎన్టీఆర్ కైనా .. జూనియర్ ఎన్టీఆర్ కైనా ఒక ప్లేస్ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి అవకాశం ఎవరికీ ఇవ్వరు. హీరో ఇమేజ్ వేరు .. రాజకీయాలు వేరు. జూనియర్ ఎన్టీఆర్ ఎంతటి చిత్తశుద్ధితో వచ్చినా ఇక్కడ ఆయన బండి నడవదు. ఒక హీరో వచ్చి ఆకాశంలో నుంచి చుక్కలు తీసుకొస్తానంటే నమ్మే రోజులు పోయాయి. ఎవరు ఏ ఉద్దేశంతో తమ మధ్యలోకి వచ్చేశారనేది జనం కనిపెట్టేశారు” అని చెప్పుకొచ్చారు.