జనసేనకు మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ గుడ్ బై

జనసేనకు మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ గుడ్ బై )

0
69

జనసేన పార్టీకీ ఏమైంది….పవన్ ఆలోచన నచ్చడం లేదా నేతల్లో నిలకడ లేదా….జనసేనానిని వెంట సైనికులేనా నేతలు రారా
..ఆరునెలలకే పార్టీ నేతలు ఆగలేకపోతున్నారా…అధికార పార్టీలో ఉన్నది ఏమిటి జనసేనలో లేనిది ఏమిటి…పవన్ సింగిల్ గా చక్రం తిప్పే ఆలోచన చేస్తున్నారా…ఆకుల నుంచి రాజా రవితేజ వరకూ ఎందుకు ఈ ఎదురుతిరుగుడు అంటే తాజాగా పార్టీ పరిస్దితి చూస్తే అవును అంటున్నారు అందరూ .

తాజాగా జనసేన నుంచి నేతలు వరస పెట్టి గుడ్ బై చెబుతున్నారు.. ఈ సమయంలో పార్టీలో మరో కీలక వికెట్ పడిపోనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంతకీ ఎవరు అనుకుంటున్నారా? జనసేన పార్టీ నాయకుడు, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆయన విశాఖపట్నం లోక్ సభ స్థానం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఓటమిని చవి చూశారు. ఆ తరువాత ఆయన జనసేనలో పెద్దగా క్రియాశీలకంగా లేరు. కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే ఆయన పాల్గొన్నారు ఇక ఆయనకు తాజాగా బీజేపీ నుంచి ఆహ్వనాలు వస్తున్నాయి అని తెలుస్తోంది. ఆయనతో బీజేపీ ఎంపీ సుజనా చౌదరి భేటీ అయ్యారు అని వార్తలు వస్తున్నాయి. త్వరలో ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉంది అని తెలుస్తోంది.