నాయకులు రాజకీయంగా ఎప్పుడూ ఓ పార్టీకే పరిమితం అని చెప్పలేము.. వివిధ పార్టీల్లోకి చేరిపోవచ్చు మళ్లీ రాజీనామా చేయవచ్చు, తాజాగా జనసేన పార్టీకి మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేయడం ఆ పార్టీ నేతలకి షాక్ కి గురి చేసింది, అయితే ఎంతో ఉన్నత ఉద్యోగం వదిలి ఆయన జనసేనలో చేరారు.. పవన్ కూడా ఆయనకు అంతే విలువ ఇచ్చారు. మరి ఆయన అనూహ్య నిర్ణయం తీసుకోవడం ఏమిటి అని చర్చ జరుగుతోంది.
రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో ఇక సినిమాలు చేయను అని చెప్పి మళ్లీ సినిమాలు చేయడం ఏమిటి నిలకడ లేకపోవడం ఏమిటి అనే కామెంట్లు చేశారు లక్ష్మీనారాయణ. అయితే 2018 మార్చిలో లక్ష్మీనారాయణ సీబీఐ నుంచి స్వచ్చంద పదవీ విరమణ చేశారు. ఏపీలో పర్యటించారు. రైతు సమస్యల గురించి తెలుసుకున్నారు
ఈ సమయంలో ఆయన జనసేనలో చేరారు. 2019 ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి జనసేన తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత రాజకీయంగా ఆయన జనసేనకు కాస్త దూరంగా ఉన్నారు, ఈ సమయంలో పార్టీని పటిష్టం చేసేందుకు జనసేనాని కమిటీలను కూడా వేశారు. ఆ కమిటీల్లో లక్ష్మీనారాయణకు చోటు కల్పించలేదు. ఇది కూడా ఆయన వర్గానికి కాస్త బాధకలిగించింది, ఇకమూడు ప్రాంతాలు డవలప్ చేస్తాను అని జగన్ చేసిన ప్రకటనపై జనసేన అభ్యంతరం తెలిపింది, జేడీ మాత్రం ఈ విషయంలో జగన్ ని సమర్ధించారు ఇలా పలు కారణాలు ఆయన పార్టీ వీడటానికి ప్రధాన కారణం అంటున్నారు.