జనసేన పార్టీకి మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ గుడ్ బై చెప్పడం, సినిమాల్లో పవన్ నటించడం పై ఆయన అభ్యంతరం చెప్పడం తెలిసిందే, అయితే ఆయన కూడా పార్ట్ టైం కాకుండా ఫుల్ టైం రాజకీయాలు చేయాలి అనే రాజకీయాల్లోకి వచ్చారు.. ఈ సమయంలో ఆయన పార్టీ అధినేత సినిమాలు చేసుకుంటూ ఇలా రాజకీయాలు చేస్తే ఎలా అని ఆయన ఆలోచన అయి ఉంటుంది.
అయితే తాజాగా జనసేన పార్టీకి గుడ్ బై చెప్పన లక్ష్మీ నారాయకు బీజేపీ ఆహ్వనం పలుకుతోంది అని తెలుస్తోంది.. త్వరలో తను ఏ రాజకీయ పార్టీలో చేరుతాను అనేది చెబుతా అంటున్నారు.. జనసేనతో తన ప్రయాణం ముగిసిన అధ్యాయమని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. తన రాజీనామా లేఖను ఆ పార్టీ ఆమోదించినందున దాని గురించి వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదన్నారు. ఇకనుంచి తన ప్రయాణమంతా రైతుల కోసం సాగుతుందన్నారు. తాను రైతుల కోసం ఇక సర్వీస్ చేస్తాను అన్నారు.
అయితే బీజేపీ ఏపీలో బలపడాలి అని భావిస్తోంది.. ఆయన బీజేపీలో చేరితే ఆయనకు పార్టీ తరపున కీలక పదవి ఇవ్వాలి అని భావిస్తోందట.. తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ని ఆయన ప్రశంసించారు. సో ఆయన బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు అనే అనుమానం చాలా మందికి కలుగుతోంది.