వాళ్లకి చెప్పుతో కొట్టినట్టుగా జేడీ సంచలన ట్వీట్.!

వాళ్లకి చెప్పుతో కొట్టినట్టుగా జేడీ సంచలన ట్వీట్.!

0
84

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలవ్వక ముందు నుంచి అలాగే ఓటమి తర్వాత కూడా జనసేన పార్టీ మరియు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లపై విష ప్రచారం ఆగలేదు.అదొక్కటే మాత్రం కాకుండా తాజాగా అయితే అదే పార్టీకు చెందిన మరో కీలక నేత అయినటువంటి మాజీ సిబిఐ జేడీ వీవీ లక్ష్మి నారాయణకు సంబంధించి ఒక వార్త ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో బాగా వైరల్ అయ్యిపోయింది.

జేడీ అతి త్వరలోనే బీజేపీ పార్టీలో చేరిపోనున్నారని రకరకాల వార్తలు రాగా ఇప్పటికే ఇలాంటి ఎన్నో వార్తలతో విసిగిపోయిన జనసేన అభిమానులు ఈ వార్తల్లో కూడా ఎలాంటి నిజము లేదని ఖండించారు.ఇక ఈ వార్త ఎలాగో జేడీ దగ్గరకే వెళ్లేసరికి ఆయన కూడా తన స్పందనను ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్న వారికి చెప్పుతో కొట్టినట్టుగా చెప్పారని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

“తనపై ఈ రోజు ఉదయం నుంచి ఇలాంటి పుకార్లు వస్తున్నాయని తెలిసి తాను షాకయ్యానని,ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్న మూర్ఖులు,పడని వారు ఇంకొంతమంది వెదవలు ఏ కోవకు చెందుతారో మీరే నిర్ణయించుకోండి” అని ఒక సంచలన ట్వీట్ పెట్టారు.”తన సేవలు జనసేన పార్టీకు అవసరం అని తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భావించించేంత వరకు జనసేన కోసం పోరాడుతానని అంతేకాని తనపై ఇలాంటి విషపూరిత వార్తలు ప్రచురించి తన సమయాన్ని వృధా చెయ్యొద్దని” మండిపడ్డారు.