ఝార్ఖండ్ కాబోయే సీఎం ప్రమాణస్వీకారానికి ఎవరిని పిలిచారో చూడండి

ఝార్ఖండ్ కాబోయే సీఎం ప్రమాణస్వీకారానికి ఎవరిని పిలిచారో చూడండి

0
92

ఝార్ఖండ్ లో బీజేపీ ఆశలు అడియాశలు అయ్యాయి… ఇక అక్కడ బీజేపీ మరో ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండాల్సిందే, అక్కడ హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు, ఈ నెల 29న జరిగే ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఝార్ఖండ్ కాబోయే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్.. కాంగ్రెస్ నేత సోనియా గాంధీని ఆహ్వానించారు. దీనికి ఆమె కూడా సానుకూలంగా స్పందించి షెడ్యూల్ ఖరారు చేసుకుంటాము అని తెలిపారట.

హేమంత్ సారథ్యంలోని జేఎంఎం కూటమి ఘన విజయం సాధించింది. వారితో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో ముందుకు వెళ్లింది చివరకు విజయం వీరిని వరించింది..రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న హేమంత్ నిన్న సోనియా, రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో వేర్వేరుగా భేటీ అయ్యారు. వారిని ముగ్గురిని అలాగే పలువురు ఉన్నత ఉద్యోగులని కూడా ఈ కార్యక్రమానికి రావాలి అని పిలిచారు.

ఝార్ఖండ్ లో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపేందుకే, సోనియాతో భేటీ అయినట్టు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఇప్పటికే ఆహ్వనించారు అనేది తెలిసిందే.