జియో కస్టమర్లకు ఆ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి సుమారు 150కి పైగా మొబైల్ మొడళ్లలో వైఫై కాలింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది జియో… నెట్ వర్క్ అందుబాటు లేనప్పుడు వైఫై ద్వారా సేవలు వినియోగించుకోవచ్చని తెలిపింది…
అంతకుముందు జియో ప్రత్యర్థి సంస్థ ఎయిర్ టెల్ వైఫై తీసువచ్చిన సంగతి తెలిసిందే… ఈ సేవలకు పోటీగా జియో తీసుకు వచ్చింది.. ఎయిర్ టెల్ వైఫై సేవలకు కేవలం మూడు మొడల్లకు మాత్రమే పరిమితం చేసింది… కానీ ప్రత్యర్థి సంస్థ జియో 150కి పైగా మొబైల్ మోడళ్లలో పనిచేస్తుందని తెలిపింది…
ముఖ్యంగా ఈ సేవలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.. గ్రామీణ ప్రాంతాల్లో నెట్ వర్క్ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంటుంది… వారికి వైఫై సేవలు ఎంతగానో ఉపయోగ పడతాయి… వైఫై సేవలు ఉపయోగించుకునేందుకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరంలేదని తెలిపింది జియో సంస్థ కేవలం సెట్టంగ్స్ లోకి వెళ్లి కాలింగ్ ఆప్షన్ ను ఎంచుకోవాలని తెలిపింది…