జియో – ఫేస్ బుక్ అతి పెద్ద బిగ్ డీల్ ఏం చేయ‌బోతున్నారంటే

జియో - ఫేస్ బుక్ అతి పెద్ద బిగ్ డీల్ ఏం చేయ‌బోతున్నారంటే

0
95

రిల‌య‌న్స్ జియో టెలికం రంగంలో కొత్త ఒర‌వ‌డి తీసుకువ‌చ్చింది, మ‌న దేశంలో అత్య‌ధిక క‌స్ట‌మ‌ర్లు వినియోగదారులు జియోకి ఇప్పుడు ఉన్నారు, ఈ స‌మ‌యంలో జియో నుంచి ర‌క‌ర‌కాల టెక్నాల‌జీ మార్కెట్లు పెంచుకుంటోంది కంపెనీ.

ప్రపంచంలో అతిపెద్ద సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ అయిన ఫేస్ బుక్ తాజాగా ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోలో వాటాలను కొనుగోలు చేసింది. అయితే ఇది భారీ డీల్ అనే చెప్పాలి, దాదాపు జియోలో 9.9 శాతం వాటా ఫేస్ బుక్ ద‌క్కించుకుంది.

ఇక దీని విలువ మార్కెట్లో 43, 574 కోట్లు అని తెలుస్తోంది. ఇక మార్కెట్లో రిలయన్స్ జియో మొత్తం విలువ రూ. 4.62 లక్షల కోట్లుగా ఉంది అనేది ఈ వాటాతో తేలిపోయింది.

ఇక వీరి ప్లాన్ చాలా పెద్ద‌దే అని అంటున్నారు, దేశంలో 130 కోట్ల మందికి కొత్త డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ఈ భాగస్వామ్యం చేసుకున్నారు., రిలయన్స్ రిటైల్, రిటైల్ న్యూ కామర్స్ వ్యాపారాన్ని విస్తరింపబోతున్నారు. అమెజాన్ లా అతి పెద్ద బిజినెస్ కు ప్లాన్ వేస్తున్నారు
కొన్ని ల‌క్ష‌ల‌ చిరువ్యాపారులను, కిరాణా షాపులను ఏకం చేసి ఒకే ఫ్లాట్ ఫామ్ పైకి తీసుకు వచ్చి దానితో దిగ్గజ రంగాలకు చెక్ పెట్టాలని ముకేష్ అంబాని ఆలోచిస్తున్నారని తెలుస్తోంది, వ‌చ్చే రెండేళ్ల‌లో జియో రిల‌య‌న్స్ మ‌రిన్ని కొత్త ఆవిష్క‌ర‌ణ‌లు వ్యాపారాలు స్టార్ట్ చేయ‌నున్నార‌ట‌.