ప్రపంచాన్ని టెన్షన్ పెట్టిస్తోంది కరోనా వైరస్ .. చైనాలో దాదాపు 1000 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు.. దీనిపై ఇప్పటికే ప్రముఖ కంపెనీలు కూడా ప్రభుత్వానికి సాయం అందిస్తున్నాయి, తమ కంపెనీ ఆదాయాల్లో కొంత భాగం సర్వీసుకి అందిస్తున్నాయి.
తాజాగా ప్రముఖ నటుడు జాకీచాన్ దీనిపై స్పందించారు, ఈ కరోనా వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది దీనిని తరిమికొట్టే మందు ఎవరైనా కనిపెడితే వారికి కోటి రూపాయలు ఇస్తాను అని ప్రకటన చేశాడు, ఈ వైరస్ తరిమికొట్టేలా మందు కనుగొంటే వారికి 1 కోటి రూపాయలు ఇస్తాను అన్నాడు.
ఈ వైరస్ వ్యాధి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అది మరింత ప్రబలకుండా వుహాన్లో జాకీచాన్ మాస్కులు, ఇతర అవసరమైన వస్తువులు పంపిణీ చేస్తున్నాడు. అతని సర్వీస్ చూసి అందరూ మెచ్చుకుంటున్నారు.జాకీచాన్ ప్రకటనపై సినిమా నటులు అలాగే వ్యాపారవేత్తలు కూడా గుడ్ డెసిషన్ అంటున్నారు.