బ్రేకింగ్ – జూలై 16 నుంచి 31 వరకు లాక్ డౌన్ కీలక ప్రకటన

బ్రేకింగ్ - జూలై 16 నుంచి 31 వరకు లాక్ డౌన్ కీలక ప్రకటన

0
87

దేశంలో కేసుల సంఖ్య భారీగా నమోదు అవుతోంది, ఈ సమయంలో ఎక్కడికి అక్కడ నగరాలు నియోజకవర్గాలు పట్టణాలు మున్సిపాలిటీల్లో వారికి వారే అధికారులు నిర్ణయం తీసుకుని లాక్ డౌన్ పెడుతున్నారు.. ఉదయం ఆరు నుంచి 11 గంటల వరకూ మాత్రమే షాపులు తీస్తున్నారు. అది కూడా నిత్యవసరాలు మాత్రమే.

అయితే తాజాగా బీహర్ లో కేసులు దారుణంగా పెరుగుతున్నాయి, దీంతో ఇక్కడ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు..జూలై 16 నుంచి 31 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

ఈ లాక్ డౌన్ మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ తెలిపారు..
ఇక రాష్ట్రంలో మొత్తం 18,853 మందికి వైరస్ సోకింది, అయితే ఇలా దారుణంగా కేసులు పెరగడంతో ఈ కీలక నిర్ణయం తీసుకుంది సర్కార్ , ఇక వీటిని ప్రజలు కచ్చితంగా పాటించాల్సిందే అని తెలిపారు.