జూన్ 30 వరకూ అక్కడ లాక్ డౌన్ ప్రభుత్వం ప్రకటన

జూన్ 30 వరకూ అక్కడ లాక్ డౌన్ ప్రభుత్వం ప్రకటన

0
126

దేశంలో వైరస్ కేసులు దారుణంగా పెరుగుతున్నాయి , మన దేశంలో లాక్ డౌన్ 31 మే వరకూ కొనసాగనుంది, కేసులు సంఖ్య మాత్రం తగ్గడం లేదు… ఓ పక్క లాక్ డౌన్ అమలు చేస్తున్నా కేసులు మాత్రం తగ్గని స్దితి, అయితే ఈ సమయంలో కేంద్రం లాక్ డౌన్ పెంచాలి అని చాలా మంది కోరుతున్నారు . మరికొందరు మాత్రం ఆర్ధికంగా ఇబ్బంది అంటున్నారు.

ఇక కేసులు ఎక్కువ ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ , డిల్లీ ఈ స్టేట్స్ లో లాక్ డౌన్ పొడిగించాలి అని అంటున్నారు, అయితే వీరికంటే ముందుగా కేంద్రం ఇంకా ప్రకటన చేయకముందు
లాక్డౌన్ను మరో ఐదువారాలు పొడిగిస్తున్నట్లు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.

ఇప్పటి వరకూ ఏ సడలింపులుఉన్నాయో అవి కొనసాగుతూ మరో ఐదు వారాలు అంటే జూన్ 30 వరకూ లాక్ డౌన్ పొడిగిస్తున్నాము అని తెలిపింది అక్కడ బిజెపి నేతృత్వంలోని జైరాం ఠాకూర్ ప్రభుత్వం. రాష్ట్రంలోని 12 జిల్లాల్లోనూ ఈ లాక్డౌన్ కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఇక అక్కడ కేసులు 210 నమోదు అయ్యాయి, ఇప్పటి వరకూ ఐదుగురు మరణించారు.హిమర్పూర్లో 63 కేసులు నమోదు కాగా, సోలన్లో 21 కేసులు నమోదు అయ్యాయి.. మరి ఈ స్టేట్ దారిలో ఇంకా ఏ రాష్ట్రాలు ఉంటాయో చూడాలి.