కేరళ ముఖ్యమంత్రి ఇంట పెళ్లి సందడి మొదలవ్వనుంది అని తెలుస్తోంది, కేరళ సీఎం విజయన్ కుమార్తె వీణ వివాహం.. సీపీఎం యువజన విభాగం డీవైఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు మహ్మద్ రియాజ్తో జరుగనుంది. వీణ బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహిస్తున్నారు. ఇక రియాజ్.. 2009 లోక్సభ ఎన్నికల్లో కొజికోడ్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం రియాజ్ న్యాయవాదిగా కొనసాగుతున్నారు.
వీరిద్దరికి వివాహం జరుగనుందట. అయితే వీరిద్దరికి ముందు వివాహాలు జరిగాయి, కాని ఇద్దరు వారి భర్త భార్యతో విడాకులు తీసుకున్నారు, ఇప్పుడు వీరు ఇద్దరు పెళ్లి చేసుకోనున్నారు, వీణకు ఒక్కరు, రియాజ్కు ఇద్దరు చొప్పున ఇంతకు ముందే పిల్లలు ఉన్నారు. ఇక బంధువులు కొద్ది మంది మిత్రుల మధ్య ఈ నెల15 న వివాహం జరుగనుంది.
మహ్మద్ రియాజ్.. రిటైర్డ్ ఐపిఎస్ ఆఫీసర్ పి. ఎం. అబ్దుల్ ఖాదర్ కుమారుడు. ఆయన 2017 సంవత్సరం పిబ్రవరిలో డివైఎఫ్ఐ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. యువనాయకుడిగా ఆయన ఇప్పుడు ఎదుగుతున్నారు, ఈ వివాహానికి చాలా తక్కువ మంది మాత్రమే రానున్నారట.