జూన్ వరకూ అవి తెరచుకోవు కేంద్రం సంచలన దిశగా అడుగులు

జూన్ వరకూ అవి తెరచుకోవు కేంద్రం సంచలన దిశగా అడుగులు

0
83

దేశంలో21 రోజుల లాక్ డౌన్ అమలులో ఉంది, అయితే కేంద్రం మరింత ఈ సమయం పొడిగిస్తుందా లేదా అనేదానిపై ప్రతీ ఒక్కరూ ఆలోచన చేస్తున్నారు, అయితే ఇప్పటికే ఏడు స్టేట్స్ లాక్ డౌన్ పొడిగించాలి అని కోరుతున్నాయి, ఈ సమయంలో కేంద్రం కూడా అదే ఆలోచన చేస్తోంది.

ఎందుకు అంటే దేశంలో కేసుల సంఖ్య పెరుగుతున్న వేళ లాక్ డౌన్ ఎత్తేస్తే మరిన్ని కేసులు పెరుగుతాయి అని భావిస్తున్నారు. రెడ్ జోన్స్ ఏర్పాటు చేసి దశల వారిగా లాక్ డౌన్ ఎత్తివేయాలని మరికొన్ని రాష్ట్రాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

తాజాగా కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశమయ్యారు. ఆ సమయంలో కూడా వారు ఇదే చెప్పారు, అంతేకాదు ఓ కీలక అంశం చర్చకు వచ్చింది.. విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, మాల్స్, సామూహిక మత ప్రార్ధనలపై మే 15 లేదా జూన్ మొదటి వారం వరకు బంద్ విధించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎలాగో స్కూల్స్ లేవు కాబట్టి మిగిలిన ఈ మాల్స్ ఇవన్నీ కూడా గేదరింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అన్నీ క్లోజ్ చేయాలి అని చెప్పారట, కేంద్రం అదే ఆలోచనచేస్తోంది అంటున్నారు అధికారులు.