మొత్తానికి రెండు నెలల లాక్ డౌన్ తర్వాత కేంద్రం కొన్ని సడలింపులు ఇస్తోంది, ఈ సమయంలో మే 31 వరకూ లాక్ డౌన్ అమలు అవుతుంది, అంతేకాదు వచ్చే నెల జూన్ 1 నుంచి రైళ్లు నడుపనున్నాము అని రైల్వేమంత్రి తెలిపారు, అయితే అన్నీ సర్వీసులు కాదు కేవలం 200 పాసింజర్ రైళ్లు నడుపనున్నారు.
అయితే ఆ సర్వీసులు ఏమిటి ఎక్కడ ఎక్కడ రైళ్లు నడుస్తాయి అనేది తెలియచేస్తాం అని చెప్పారు మంత్రి పియూష్ గోయల్.జూన్ 1 నుంచి సమయానుకూలంగా 200 ప్రత్యేక నాన్ ఏసీ సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే వీటికి సంబంధించిన షెడ్యూల్ వస్తుంది, అయితే అవి ఏ టైమ్ లో బయలుదేరుతాయో అదే టైం ఉంటుంది అని అంటున్నారు అధికారులు.
బహుశా టైం మార్చేది ఉండదు, ఇక వీటికి సంబంధించి రిజర్వేషన్లపై కూడా రెండు రోజుల్లో ప్రకటన రానుంది. ఇక దూర ప్రాంతాలలో ఉండిపోయి గ్రామానికి వెళ్లాలి అని అనుకునే వారికి ఇది మంచి శుభవార్త అనే చెప్పాలి. ఇక రైల్వే స్టేషన్లో టికెట్లు ఇవ్వరు, అంతా ఆన్ లైన్ లోనే టికెట్ తీసుకోవాలి, మాస్క్ ధరించాలి, గంట ముందు స్టేషన్ కు రావాలి ధర్మల్ టెస్ట్ చేసిన తర్వాత రైలు ఎక్కనిస్తారు.