కాంగ్రెస్​ మరో పోరాటం..ప్లాన్ ఫలించేనా..?

Jung Siren from tomorrow

0
109

విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై పోరాటానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. గాంధీ జయంతి అక్టోబర్ 2 నుంచి సోనియమ్మ బర్త్ డే డిసెంబర్ 9 వరకు 67 రోజుల పాటు ఈ జంగ్ సైరన్ కార్యక్రమం కొనసాగనుంది. మొన్నటి వరకు ఆగస్టు 9 క్విట్ ఇండియా దినోత్సవం నుంచి సెప్టెంబర్ 17న తెలంగాణ విలీన దినోత్సవం వరకు దళిత, గిరిజన ఆత్మ గౌరవ దండోరా ఉద్యమం చేపట్టిన కాంగ్రెస్ ఇప్పుడు నిరుద్యోగులను ఏకతాటిపైకి తెచ్చేలా జంగ్ సైరన్ చేపట్టబోతుంది.

రేపు మధ్యాహ్నం 3 గంటలకు దిల్ సుఖ్ నగర్ రాజీవ్ చౌక్ లో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. అక్కడ నుంచి ఎల్ బి నగర్ శ్రీకాంతాచారి విగ్రహం వరకు భారీ పాదయాత్రతో ఈ జంగ్ సైరన్ కార్యక్రమం ప్రారంభం కానుంది.

ఈ జంగ్ సైరన్​తో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన విద్యార్థి, నిరుద్యోగ యువతను తమ వైపునకు ఆకర్షించే కార్యచరణ సిద్ధం చేసింది. కాంగ్రెస్ ప్లాన్ ఏమాత్రం ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి మరి.

ఈ పాదయాత్రలో ఏఐసీసీ ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, వర్కింగ్ ప్రసిడెంట్లు, చైర్మన్ లు, ఏఐసీసీ కార్యదర్శులు, ముఖ్య నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్. ఎస్.యూ.ఐ, విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొననున్నారు.