రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్..లక్ష్మీపార్వతి సెన్సేషనల్ కామెంట్స్

0
85

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్, అమిత్ షా భేటీపై నందమూరి లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని తెలుగుదేశం పార్టీని స్వాధీనం చేసుకోవాలంటూ లక్ష్మీ పార్వతి సూచించారు. అదే తన కోరిక అంటూ ఆమె పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా వ్యవహరించి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్నారంటూ ఆరోపించారు.