భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లలిత్ ప్రమాణం

0
99

భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యు.యు. లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్‌ లలిత్‌తో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సీజేఐగా ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్​వీ రమణ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు కేంద్రమంత్రులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.